చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో కల్కి భక్తుల నిరాహారదీక్షలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Kalki-Amma Bhagavan
చెన్నై: కల్కి పై మీడియా ప్రసారం చేస్తున్న కథనాలను వ్యతిరేకిస్తూ చెన్నైలో రెండు వేల మందికి పైగా భక్తులు నిరాహార దీక్ష చేపట్టారు. గత వారం కొన్ని తెలుగు, తమిళ టివి చానెళ్లలో కల్కికి వ్యతిరేకంగా వార్తలు వచ్చిన విషయం విదితమే. దీన్ని నిరసిస్తూ నయాన్‌దాసాజీ నేతృత్వంలో ఈ దీక్ష చేపట్టారు.

ఆయన మాట్లాడుతూ టివిల్లో వచ్చిన విజువల్స్‌ నిజమేనని, అయితే భక్తులు పారవశ్యంతో చేస్తున్న నృత్యాలను వక్రీకరించి టివిలలో ప్రసారం చేయడం మంచిది కాదని తెలిపారు. దేవుడితో కలసి చేస్తున్న నృత్యాలను పిచ్చి చేష్టలనడం సరికాదన్నారు.

ఆయన ముందు తన్మయత్వంలో భక్తులు ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తుంటారని, కొంత మంది గదుల్లో పారవశ్యం పొందుతుంటారని అన్నారు. కల్కి సర్వాంతర్యామి అని, మీడియా ఇటువంటి ప్రసారాలు ఎన్ని చేసినా ఆయనను ఏమీ చేయలేవని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X