వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంగీతం కోటికి కువైట్ లో సత్కారం

By Santaram
|
Google Oneindia TeluguNews

Koti
కువైట్‌: ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి కోటేశ్వరరావు (కోటి)ని గల్ఫ్‌వైడ్‌ నందమూరి ఫ్యాన్స్‌ కువైట్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శుక్రవారం రాత్రి కళాంజలి సాంస్కృతికసంస్థ ఆధ్యర్యంలో జరిగిన ఉగాది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సంగీతవిభావరిలో కోటి పాల్గొన్నారు. ఈసందర్భంగా కోటి మాట్లాడుతూ చిన్నతనం నుంచి నందమూరి తారకరామారావు అభిమానినని చెప్పారు. కువైట్‌లో తెలుగువారి మధ్య గడపటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కోటి ఆధ్వర్యంలో విజయలక్ష్మి, అనూజ్‌, వెంకటబాబు తదితరులు పలుసినీగేయాలను ఆలపించారు.

రాక్‌డ్యాన్స్‌ అకాడమి కొరియోగ్రాఫర్‌ ఈశ్వర్‌ నేతృత్వంలో బాలబాలికు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఇదే వేదికపై అన్నదాత మురళీమనోహర్‌ జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. కళాంజలి అధ్యక్షులు మురళీమనోహర్‌, గల్ఫ్‌వైడ్‌ నందమూరి ఫ్యాన్స్‌ కువైట్‌ కార్యవర్గసభ్యులు దార్ల శ్రీనివాస ఆచారి, వేగి వెంకటేష్‌ నాయుడు, దరూరి బలరాం నాయుడు, తుమ్మల వెంకటరత్నం, మేడమల్లి శ్రీను, పోలినేని శాంతారాం నాయుడు, పొత్తూరి పార్ధసారధి, మాలెంపాటి సురేష్‌, లక్ష్మీపతి, నాగేంద్ర మారాతు, కిశోర్‌ శౌదరి, నందా, రెడ్డిమాసి సుబ్బయ్య, కువైట్‌లోని ఇండియన్‌ ఎంబసి అధికారి నర్సింగరావ్‌, యువశాస్త్రవేత్త నెట్టం చిన్నికృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X