హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విచారణ జీవితంలో కష్టకాలం: మోడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
హైదరాబాద్: సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తనను విచారించిన సమయం కష్టమైన క్షణాలుగా గడిచాయని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ కష్టకాలంలో తన పక్కన నిలబడిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిట్ విచారణ వివరాలను ఆయన తన బ్లాగ్ లో రాసుకున్నాడు. చట్ట ప్రక్రియలో తాను పూర్తిగా సహకరించానని, దాని ఆధిపత్యాన్ని తాను అంగీకరించానని ఆయన అన్నారు.

మీ పని ముగిసిందని తాను సిట్ తో చెప్పినట్లు రెండో సారి తనను విచారించిన తర్వాత మోడీ తెల్లవారు జామున ఒంటి గంట సమయంలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. సిట్ విచారణలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని వివరించినట్లు ఆయన తెలిపారు. సిట్ తో తాను మాట్లాడిన విషయాలు చెప్పలేనని, సిట్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X