హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిల్మ్ నగర్ సొసైటీలో నాకు అన్యాయం: వేటూరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Veturi Sundararama Murthy
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ సొసైటీ భూకేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ సభ్యుల్లో తనకు సీనియారిటీ ఉందని, తనది తొమ్మిదో నెంబర్ అని, అయినా గత 15, 20 ఏళ్లుగా తనకు స్థలం కేటాయించలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని ఆయన చెప్పారు. గత ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడికి, వైయస్ రాజశేఖర రెడ్డికి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు.

ఫిల్మ్ సొసైటీ భూములు సినిమా రంగంతో సంబంధం ఉన్నవారికి, లేనివారికి దారాదత్తం అవుతున్నాయని, కానీ తనకు మాత్రం స్థలం కేటాయింపు జరగడం లేదని ఆయన అన్నారు. ఇది సొసైటీ తప్పిదం అనబోనని, ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా భూములను వారి చేతుల్లో పెట్టడం వల్లనే ఇది జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ప్రత్యేకంగా తాను విజ్ఞప్తి చేయబోనని, మీడియాతో చెప్పిన మాటలను చెవులుంటే విని, కళ్లుంటే చదివి తెలుసుకోవాలని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ చెన్నైకి తరలిపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X