• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తొలి పెళ్లి చిక్కుల్లో షోయబ్ మాలిక్

By Pratap
|

Shoaib Malik
హైదరాబాద్: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను పెళ్లి చేసుకోబోతున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ చిక్కుల్లో పడ్డారు. మాలిక్ పై కేసు పెడతానంటూ అయేషా సిద్ధిఖి తండ్రి హెచ్చరించాడు. తన కూతురే మాలిక్ మొదటి భార్య అని, సానియా మీర్జా రెండవ భార్య అవుతుందని ఆయన అన్నారు. సానియా కూడా తన కూతురు వంటిదేనని ఆయన అన్నారు. అయితే తన కూతురుకు మాలిక్ విడాకులు ఇవ్వాల్సిందేనని సిద్దిఖీ డిమాండ్ చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ అమ్మాయి అయేషాను పెళ్లి చేసుకుని ఆమె లావుగా ఉందంటూ వదిలేశాడని చెబుతున్నారు.

కాగా, హెడ్ లైన్స్ టుడే వద్ద ఉన్న వీడియో కూడా షోయబ్ మాలిక్ ను ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఉంది. మాలిక్ గతంలో పెళ్లి చేసుకున్నట్లు అంగీకరించి అందుకు శుభాకాంక్షలు అందుకున్న వీడియో తమ వద్ద ఉందని హైడ్ లైన్స్ టుడే అంటోంది. ఈ వీడియోను 2005 మార్చి 30వ తేదీన హైదరాబాదులో రికార్డు చేశారు. హైదరాబాదులో క్రికెట్ మ్యాచ్ తర్వాత తాను పెళ్లి చేసుకున్నానని, తన భార్య నగరంలో తాను క్రికెట్ ఆడుతున్నానని మాలిక్ అన్న మాటలు అందులో రికార్డు అయినట్లు చెబుతున్నారు.

తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ తో మాలిక్ చెబుతున్నప్పుడు ఆ వీడియో తీశారు. కొంత అసంతృప్తికి గురైన మాట వాస్తవమేనని, తాను 82 పరుగులు చేశానని, దాంతో బాగానే ఉన్నానని, ఇది తన భార్య ఇల్లు ఉన్న నగరమని, అందుకు సంతోషంగా ఉన్నానని మాలిక్ అరుణ్ లాల్ తో చెప్పాడు. అరుణ్ లాల్ శుభాకాంక్షలు చెప్పాడు. ఆ శుభాకాంక్షలను మాలిక్ స్వీకరించాడు. ఈ సంభాషణల్లో మాలిక్ చెప్పిన తన భార్య సానియా కాదు, అయేషా అంటూ ఓ వైబ్ సైట్ రాసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X