విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంద్ర కీలాద్రిపై ముద్దు ముచ్చట్లు: ఇవో

By Pratap
|
Google Oneindia TeluguNews

Indra Keeladri
విజయవాడ: విజయవాడలోని దుర్గ గుడి ప్రాంగణం అసభ్య కార్యకలాపాలకు నిలయంగా మారిందని దుర్గ గుడి ఎగ్జిక్యూటీవ్ అధికారి విజయ్ కుమార్ ఆరోపించారు. ఇంద్ర కీలాద్రిపై ఉద్యోగులు, కార్మికులు ముద్దులు పెట్టుకుంటున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గతంలో కూడా ఇంద్ర కీలాద్రిపై ముద్దుముచ్చట్లు సాగేవని, గత ఎగ్జిక్యూటివ్ అధికారుల అసమర్థత వల్లనే ఇదంతా జరిగిందని, ఇప్పుడు కూడా అది సాగుతోందని ఆయన అన్నారు.

గుడి పవిత్రత కోసం తాను ఎన్నో దాస్తున్నానని ఆయన అన్నారు. గుడి పవిత్రత కోసం తాను పాటుపడుతుంటే ఉద్యోగులు, కార్మికులు అపవిత్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కౌబాయ్ లా ఉండే తాను పవిత్రత కోసం సంప్రదాయ దుస్తులు ధరిస్తున్నానని ఆయన అన్నారు. జీన్స్, టీ షర్లు వేసే తాను ఇప్పుడు గుడి పవిత్రత కోసం సంప్రదాయబద్దంగా వ్యవహరిస్తున్నానని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు అర్చకులతో పూజలు చేయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X