వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద అరెస్టులో పోలీసుల తాత్సారం

By Santaram
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూరు: రాసలీలల నిత్యానంద స్వామి విషయంలో కర్ణాటక పోలీసులు ఎందుకో తాత్సారం చేస్తున్నారు. సాధారణ నేరస్తులను బీహార్, యుపి వరకు వెళ్ళి అరెస్టు చేసి తీసుకు వస్తున్న పోలీసులకు నిత్యానంద దొరకడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. దేశంలోని పలుప్రాంతాల్లో పెద్ద పెద్ద ఆశ్రమాలు, భారీ సంఖ్యలో దేశ విదేశీ భక్తులు-అడుగడుగునా వారి సాష్టాంగ ప్రణామాలు, ప్రవచనాలు వినేందుకు కిక్కిరిసే భక్త పరమాణువులు, వేల సంఖ్యలో అమ్ముడయ్యే నిత్యానంద పుస్తకాలు....దాదాపు నెల కిందట ధ్యానపీఠం వ్యవస్థాపకుడు నిత్యానంద పరమహంస వైభోగం ఇదీ. ఏ సమయంలో ఆయన ఎక్కడ ఉంటారో? ఎక్కడ ప్రవచనాన్ని ఇస్తారో ఒకరిద్దరు ఆప్త వర్గాలకు మినహా ఇతరులకు తెలియకుండా గోప్యంగా ఉంచేవారు.

పరిస్థితి తారుమారైంది. మార్చి నాలుగున నటి రంజితతో రాసలీలల ప్రక్రియ వెలుగు చూసిన తరువాత ఆయన ఎవరికీ కనిపించకుండా వెళ్లి నెలరోజులు కావస్తోంది. కామకేళికి-తనకు సంబంధం లేదని మొదట బుకాయించారు. అనంతరం వీడియోలో ఉంది తానేనని అంగీకరించారు. అయితే తాను మగతగా ఉన్నప్పుడు వాటిని చిత్రీకరించారని వాదిస్తూ వీడియోలను విడుదల చేశారు. ఒక వారంలోగా భక్తుల ముందుకు వచ్చేస్తానంటూ ఆ వీడియోల్లో ప్రకటించారు. ప్రకటనలు చేస్తూనే ముందస్తు జామీను కోసం రామనగర కోర్టులో అర్జీ వేసుకున్నారు. కోర్టు జామీను నిరాకరించింది. మరోసారి ఆయన అర్జీ వేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలకు తమకు ఇంకా అందనందున జామీను ఇవ్వటం సాధ్యం కాదని, న్యాయమూర్తి తెలిపారు.

హరిద్వార్‌లో కుంభమేళా ఉత్సవాల్లో పాల్గొంటున్నానని నిత్యానంద విడుదల చేసిన వీడియోలో ప్రకటించారు. కుంభమేళా ముగిసినా ఆయన జాడ లేదు. తమిళనాడులో నిత్యానందపై నమోదైన కేసులను అక్కడి పోలీసులు నగర పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు పత్రాలన్నీ తమిళంలో ఉన్నాయి. వీటిని కన్నడ, ఆంగ్ల భాషల్లోకి అనువదించే ప్రక్రియ ప్రారంభమైంది. తాను ఆశ్రమ బాధ్యతలను వదలి పెడుతున్నట్లు నిత్యానంద తాజాగా వీడియో ప్రకటన చేశారు. పూర్వాశ్రమంలో మౌనంగా తపస్సు చేసుకున్నట్లే ఎవరికీ కనిపించకుండా వెళ్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X