హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులోనే సానియా వివాహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Marriage in Hyd, confirms Sania’s family
హైదరాబాద్: సానియా, షోయబ్ మాలిక్ ల వివాహం హైదరాబాదులోనే జరుగుతుందని సానియా కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఇరు కుటుంబాలు తీసుకున్న నిర్ణయం ప్రకారం పెళ్లి హైదరాబాదులోనే జరుగుతుందని వారు చెప్పారు. అయేషా వివాదం నేపథ్యంలో వివాహ వేదిక దుబాయ్ కు మారే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన వార్తలో నేపథ్యంలో వారు ఈ వివరణ ఇచ్చారు. వారిద్దరి వివాహం ఈ నెల 15వ తేదీన జరుగుతుందని కూడా వారు చెప్పారు.

సానియా, షోయబ్ ల వివాహ వేదిక దుబాయ్ కి మారే అవకాశాలున్నాయని ఓ పాకిస్తానీ టీవీ చానెల్ వార్తకథనాన్ని ప్రసారం చేసింది. అంతేకాకుండా పెళ్లి తేదీ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయని ఆ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. అయేషా వివాదం నేపథ్యంలో షోయబ్ మాలిక్ దుబాయ్ నుంచి శుక్రవారం హైదరాబాద్ వచ్చాడు. చాముండేశ్వరీనాథ్ ద్వారా అయేషాతో రాజీకి అతను ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X