వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది ఆమె ఇష్టం: సానియా పెళ్ళి పై జైపాల్

By Santaram
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
న్యూఢిల్లీ: సానియా పెళ్లిపై బాల్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఖండించారు. ప్రతి దానికీ మతం రంగు పులిమే ఆయన వైఖరికి ఇది నిదర్శనమన్నారు. "పాకిస్థాన్‌తో మన దేశం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం నిజమే! అయినంతమాత్రాన, ఇరు దేశాల ప్రజల మధ్య కూడా సత్సంబంధాలు ఉండొద్దని కాదు. ఈ వివాహం పూర్తిగా సానియా వ్యక్తిగత విషయం. ఎవరినైనా ఎంపిక చేసుకునే హక్కు ఆమెకుంది. ఈ విషయంపై రాజకీయపరంగా విమర్శలు గుప్పించడం దురదృష్టకరం'' అని జైపాల్‌రెడ్డి శనివారం ఢిల్లీలో విలేఖరులతో అన్నారు.

ఇలా ఉండగా ఆయేషా తన భార్య కాదంటూ పాక్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ చేస్తున్న వాదనలో పసలేదని ఆమె తరపు న్యాయవాది ఫరూక్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన పాక్‌కు చెందిన జియో ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'వారి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించా. కేసులో ఇదే కీలకం. అలాగే పెళ్లి సమయంలో అక్కడే ఉన్న ఇంజమామ్‌ ఉల్‌ హక్‌తోనూ మాట్లాడా' అని ఫరూక్‌ హుస్సేన్‌ వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X