వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో కోదండరామ్ కు గాయాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొ. కోదండరామ్‌కు గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోదండరామ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

తొలుత ఆయనకు ఘటకేసర్‌లోని కల్కి ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. కోదండరామ్‌కు ప్రమాదం జరిగిందని తెలియడంతో జేఏసీ నాయకులు ఆందోళనకు గురయ్యారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందవలసి ఉంది. కోదండరాం భువనగిరిలో జరిగిన తెలంగాణ ధూంధాంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X