హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘనంగా సబితా ఇంద్రారెడ్డి కుమారుడి పెళ్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి వివాహం హైదరాబాదు సమీపంలోని శంషాబాదులో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మంత్రులు, శాసనసభ్యులు హాజరయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, బిజెపి నాయకుడు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

అయితే ఈ పెళ్లి వేడుకలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. వివాహ వేదిక మీదికి ఎక్కువ మంది ఒకేసారి రావడంతో వేదిక ముందు భాగం ఒరిగింది. దీంతో కొంత మంది కింద పడ్డారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చినప్పుడే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X