హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్ లక్ష్మి ఎలా బయటపడిందంటే....

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఐటి ప్రొఫెషనల్స్ పై నగర పోలీసులు బాధ్యతతో వ్యవహరిస్తున్నారా? ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఐటి ఉద్యోగుల్లో అధికశాతం మందికి ఉద్యోగం, కుటుంబం తప్ప మరో ధ్యాసలు తక్కువ. ఇన్ఫోసిస్ లక్ష్మి విషయంలో నైనా, విరించి టెక్నాలజీస్ శ్రీనివాస్ విషయంలో నైనా పోలీసులు అనవసర వివాదాలకు సంచలనాలకు తావు ఇవ్వకుండా ప్రొఫెషనల్స్ లా వ్యవహరించారు. న్యూస్ చానల్స్ వాళ్ళు గొట్టాలు పెట్టి, రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడానికి ప్రయత్నించినా వారు మారు మాట్లాడకుండా తమ పని తాము చేసుకుపోయారు.

సోమవారం ఉదయం ఇన్ఫోసిస్ లక్ష్మి కంపెనీ బస్ మిస్ కావడం, ఆటో ఎక్కి బస్ ను చేజ్ చేయమనడం, ఆ కంగారులో డ్రైవర్ పక్కన మరో వ్యక్తి ఉన్న విషయం గమనించకపోవడం జరిగాయి. తీరా తాను కిడ్నాప్ అయిన విషయం తెలుసుకున్న తర్వాత ఆమె తన హ్యాండ్ బ్యాగ్ ను విసిరేయడం మంచి పని. దానిలో ఉన్న సెల్ ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా సమాచారం ఇంటికి, ఇన్ఫోసిస్ కు చేరిపోయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

ఇన్ఫోసిస్ లక్ష్మిని ఆటోవాలా కిడ్నాపర్లు ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి నిర్బంధించారు. వాళ్ళ లక్ష్యం ఆమె ఒంటి మీద ఉన్న నగలే. అయితే తమిళనాడు-కేరళ సరిహద్దుకు చెందిన ఆమె సహజంగా తెలివిగా వ్యవహరించి, సాయంత్రం వరకు గానీ ఆ నగలు వారికి ఇవ్వనట్టు తెలిసింది. చదువు పెద్దగా లేని ఆ రఫ్ ఆటో వాళ్ళను ఆమె అన్ని గంటలపాటు ఎదుర్కోవడం గొప్ప విషయమే. ఒక పెద్ద కంపెనీలో క్వాలిటీ మేనేజర్ గా ఆమెకున్న మేనేజ్ మెంట్ అనుభవమే ఆమె ధైర్యానికి కారణమైంది. నగలు పోయినా ఇంకా విలువైన దానిని పోగొట్టుకోకుండా ఆమె బయటపడగలిగింది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఇటువంటి యుక్తితో, ఇటువంటి ధైర్యంతో ముందుకు సాగాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X