హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్య కేసులో ఎన్నారై కుసుమ లొంగుబాటు

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: లాడ్జి యజమాని దారుణ హత్య కేసులో కీలక సూత్రధారి పడమటి కుసుమకుమారి మూడో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు బుధవారం మధ్యాహ్నం లొంగిపోయింది. గత ఏడాది డిసెంబర్‌ 20న శ్రీకృష్ణనగర్‌లోని శ్రీకాంత్‌ లాడ్జి యజమాని షాబాద్‌ హనుమంతరావు నలుగురు దుండగుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. లాడ్జి పక్కన ఉన్న 750 గజాల భూ వివాదానికి సంబంధించి అడ్డుగా ఉన్న హనుమంతరావును తొలగించుకునేందుకు గుంటూరుకు చెందిన నలుగురు కిరాయి హంతకులతో కుసుమకుమారి హత్య చేయించినట్టు అభియోగం.

జూబ్లీహిల్స్‌ ఎస్సై కె.నాగేశ్వరరావు ఈ హత్యోదంతంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు. హత్యకు పాల్పడిన గుంటూరుకు చెందిన కిరాయి హంతకులు సుభాష్‌గౌడ్‌, దాసరి వెంకటదుర్గారావు, శ్రీనివాస్‌, ప్రసాద్‌ తదితరులను అదుపులోకి తీసుకొని విచారించగా, హత్య చేయించింది కుసుమకుమారే అని వారు వెల్లడించారు. ఆమెతో రూ. 10 లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకున్నామని, వివాదంలో ఉన్న భూమిలో కొంత స్థలాన్ని ఇవ్వాలని ఒప్పందం చేసుకొని హత్యకు పాల్పడినట్లు వివరించారు.

హంతకులను ఫిబ్రవరి 2న రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కుసుమకుమారి ఎట్టకేలకు బుధవారం కోర్టులో లొంగిపోయారు. కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటూ ఏడాదిన్నర క్రితమే ఆమె నగరానికి వచ్చి జూబ్లీహిల్స్‌ సమీపంలోని ఇక్రిశాట్‌ కాలనీలో నివాసముంటున్నారు. హత్య జరిగిన తర్వాత పరారైన ఆమె పోలీసుల గాలింపు ముమ్మరం కావడంతో చివరకు లొంగిపోయారు. ఆమెతో పాటు సోదరి ప్రమీలారాణి కూడా ఈ హత్యలో రెండవ ముద్దాయిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. వీరందరిపైన ఐపీసీ సెక్షన్‌ 302 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X