హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాక్సిడెంట్ మిస్టరీ, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఒక సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఒక కారు ప్రమాదానికి కారణం తానేనంటూ పోలీసుల ముందు మూడు రోజుల తర్వాత లొంగిపోయాడు. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీవీ ఘాట్ సమీపంలో కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు ఖైరతాబాద్ స్ధానికులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి తానే కారణమంటూ మల్కాజిగిరికి చెందిన యు. శ్రీనివాస్ శ్రీకాంత్ (36) ఠాణాలో లొంగిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. అతను విరించి ఇన్ఫోటెక్ లో సీనియర్ టెక్నాలజీ ఆఫీసర్ (సిటివో) గా పనిచేస్తున్నాడు.

ఈ సంఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దుర్ఘటనను తాము స్వయంగా చూశామని, బాగా మద్యం తాగి ఉన్న ఒక యువతి నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో శ్రీనివాస్ శ్రీకాంత్ కారులో ఉన్నాడా? ఉంటే ఏ స్ధితిలో ఉన్నాడు? కారు నడిపిన ఆ యువతి ఎవరు? శ్రీనివాస్ శ్రీకాంత్ ఎందుకు లొంగిపోవలసి వచ్చింది? పోలీసులు, క్రిమినల్ లాయర్ల వ్యూహ రచనలో అమాయకులకు న్యాయం జరుగుతుందా? న్యాయమూర్తులు అసలు నిజం కనుక్కోగలరా? కాలమే తీర్పు చెప్పాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X