వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో 11న తెలుగు ఉగాది వేడుకలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Bangalore Ugadi Celebrations
బెంగళూరు: మొట్టమొదటిసారిగా బెంగళూరు నగరంలో తెలుగు ఉగాది వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. శ్రీ వికృతినామ సంవత్సర ఉగాది వేడుకలు, ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవ పురస్కారాల కార్యక్రమాలను ఈ నెల 11న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు మాతెలుగుతల్లి కన్వీనర్‌ కే ఉమామహేశ్వరరావు, బెంగళూరు తెలుగు సంఘం కన్వీనర్‌ పట్టుబాల భాస్కర్‌రెడ్డి, హెచ్‌ఏఎల్‌ తెలుగు సాహిత్య సమితి కన్వీనర్‌ ఎస్‌ కొండయ్య బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో తెలుగు సంఘాలు కలసి నిర్వహించే ప్రప్రథమ వేడుకలు కావడంతో ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తామన్నారు.

శ్రీ శివసాయిబాబా సానిథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పాత ఎయిర్‌పోర్టు వద్ద హెచ్‌ఏఎల్‌ కన్వెన్‌షన్‌ హాల్‌లో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అరవింద లింబావళి వీటిని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ సీనియర్‌ నాయకులు ఎం వెంకయ్యనాయుడు హాజరవుతారని, కేఎంఎఫ్‌ అధ్యక్షుడు శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలనం చేస్తారని తెలిపారు.

విశేష అతిథులుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యవసాయ శాఖమంత్రి రఘువీరారెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌరవ అతిథులుగా శాసనసభ్యులు ఎన్‌ నందీశ్ ‌రెడ్డి, ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌, పరుచూరి గ్లోబల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు పరుచూరి సురేంద్రకుమార్‌, బెంగళూరు తూర్పువిభాగం డీసీపీ ఎం చంద్రశేఖర్‌, జేఆర్‌ హౌసింగ్‌ డెవలపర్స్‌ సీఎండీ ఎస్‌ జగదీశ్వరరెడ్డి పాల్గొంటారని వివరించారు. వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ తెలుగు సినీ నటులు డాక్టర్‌ నూతనప్రసాద్‌ హాజరవుతారని, హెచ్‌ఏఎల్‌ తెలుగు సాహిత్య సమితి వ్యవస్థాపకులు తోట వీర్రాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు.

బెంగళూరు మహా నగరంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న తెలుగు ప్రముఖులకు ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయల పంచశతమాన పట్టాభిషేక మహోత్సవ పురస్కారం అందజేస్తామని ఉమామహేశ్వరరావు తెలిపారు. పురస్కారాలు అందుకోనున్న వారిలో కర్ణాటక ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసులు మల్లాది జయశ్రీ, ప్రసిద్ధ సాహితీవేత్త, హరికథా భాగవతులు ప్రొఫెసర్‌ హెచ్‌ఎస్‌ బ్రహ్మానందం, ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు ఎస్‌ నరసరాజు, బెంగళూరు హెచ్‌ఎఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం కార్యనిర్వహణాధికారి పీ సుధాకర్‌రావు, సేవాభారతి ట్రస్టు అధ్యక్షులు బండి ఆదినారాయణరెడ్డి, సామాజిక సేవకులు హెచ్‌ తిప్పారెడ్డి, శ్రీనందిని ప్యాలెస్‌ గ్రూప్‌ ఆఫ్‌ రెస్టారెంట్స్‌ సీఎండీ డాక్టర్‌ ఆర్‌ రవిచందర్‌ ఉన్నారని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X