రోశయ్య మంత్రివర్గ విస్తరణ వాయిదా

Rosaiah
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లే ఉంది. రోశయ్య శుక్రవారం కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనయా గాంధీని కలవాల్సి ఉంది. అయితే ఆయనకు సోనియా గాంధీ అపాయింట్ మెంటు దొరకలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణను ముఖ్యమంత్రి వాయిదా వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన తిరిగి ఈ నెల 15, 16 తేదీల్లో ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఆయన మంత్రివర్గ విస్తరణపై సోనియా గాంధీతో మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు.

మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్ రావు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా అనుకూలంగా ప్రతిస్పందించలేదని తెలుస్తోంది. దీంతో రోశయ్య మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్లేనని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+