న్యూఢిల్లీ: దంతెవాడ ఘటనకు పూర్తి బాధ్యత తనదేనని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. ఇక్కడ జరిగిన సిఆర్పీఎఫ్ కార్యక్రమంలో శుక్రవారం ఈ విషయం చెప్పారు. దంతెవాడ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలిసి ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ఒక లేఖను అందజేసినట్లు ఆయన తెలిపారు.
దంతెవాడ సిఆర్పిఎఫ్ అమర జవాన్లను దేశం మరిచిపోదని ఆయన అన్నారు. రిజర్వ్ పోర్సు కన్నా సిఆర్పీఎఫ్ ఎక్కువని ఆయన అన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ఈ నెలాఖరు లోగా పరిహారం అందజేస్తుందని ఆయన చెప్పారు.