హైదరాబాద్ : రాష్ట్రంలోని వెనకబడిన వర్గాలతో పాటు దళిత, మహిళ, మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. రవీంద్రభారతిలో జరిగిన మహాత్మా జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగిస్తూ బీసీల అభివృద్దికోసం అహరహం కృషి చేసిన పూలే సిద్దాంతాల స్ఫూర్తితో రాష్ట్రంలో బీసీల కోసం దాదాపు రూ.1700 వందల కోట్లకు పైగా నిధులను కేటాయించినట్టు తన ప్రసంగంలో పేర్కొన్నారు.