హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం రాజు ఆరోగ్యం ఆందోళనకరం

By Santaram
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్‌: సత్యం రామలింగరాజు ఆరోగ్యం బాగా క్షీణించి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నాళ్లుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రిమాండ్‌ ఖైదీ సత్యం మాజీ అధినేత రామలింగరాజు ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆయన హెపటైటిస్‌-సి వ్యాధితో బాధపడుతున్నారని, కాలేయం దెబ్బతినడంతో పాటు గుండె జబ్బు కూడా ఉందని వైద్యులు గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య 1800కు పడిపోయినట్లు పేర్కొన్నారు.

సాధారణంగా వీటి సంఖ్య 6వేల నుంచి 11వేల వరకు ఉండాల్సి ఉండగా సంఖ్య గణనీయంగా పడిపోయిందన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆస్పత్రిలోని మెట్టు రంగారెడ్డి వీఐపీ బ్లాక్‌లో ప్రొఫెసర్‌ అజిత్‌ కుమార్‌, కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్‌ శేషగిరిరావు పర్యవేక్షణలో చికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం రాజు శరీరంలోని తెల్లరక్త కణాల సంఖ్య 2300కు చేరుకుందని వైద్యులు వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X