హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్ లదే తప్పని తేల్చిన ప్రెస్‌ కౌన్సిల్‌ నివేదిక

By Srikanya
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించిన ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విచారణ పూర్తి చేసిన పీసీఐ ఈ ఘటనపై నలుగురు పోలీసు అధికారుల తీరును తప్పుబట్టింది. జాయింట్‌ కమిషనర్‌ రామాంజనేయులు, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ మహేష్‌ చంద్ర లడ్హా, ఏసీపీ కె రామచంద్ర, సీఐ అంజయ్యలపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. భవిష్యత్‌ లో ఈ నలుగురికి మీడియాతో సంబంధంలేని పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.

అలాగే పోలీసుల దాడిలో గాయపడ్డ జర్నలిస్టుల ఖర్చు, ధ్వంసమైన సామాగ్రీ పరిహారం ప్రభుత్వమే చెల్లించాలని పీసీఐ సిఫారసు చేసింది. ధ్వంసమైన మీడియా వాహనాలు, పరికరాలకు పరిహారం ఇవ్వాలంది. ఈ నివేదికను శాసనసభలో చర్చించాలని ప్రభుత్వాన్ని ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. పోలీస్‌ శాఖ ఓ నోడల్‌ అధికారిని నియమించుకోవాలని, మీడియాతో ఆ అధికారి ద్వారా సంప్రదింపులు జరపాలని నివేదిక తెలిపింది. కాగా రెచ్చగొట్టే దృశ్యాలను పదేపదే ప్రసారం చేయరాదంటూ ఛానళ్లకు పీసీఐ సూచించింది. ఈ నివేదకను ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 17న ముఖ్యమంత్రికి సమర్పించనుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X