వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎస్ ఎల్వీ-డి3 రాకెట్ ప్రయోగం విఫలం

By Santaram
|
Google Oneindia TeluguNews

GSLV rocket blasts off
శ్రీహరికోట: సతీష్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌నుంచి జీఎస్ ‌ఎల్వీ-డి3 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగికెగిసి విఫలమైంది. ఈరోజు సాయంత్రం 4.27 నిముషాలకు ఈ ప్రయోగం ముగిసింది. రాకెట్‌కేంద్రంలోని రెండవ లాంచింగ్‌ప్యాడ్‌ నుంచి దీన్ని ప్రయోగించారు. అయితే ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శాస్త్రవేత్తలను నిరాశపరుస్తూ ఈ రాకెట్‌ కక్ష్యనుంచి కొంత పక్కకు వెళ్లింది. దీంతో నిర్దేశిత కక్ష్యలోకి ఈ రాకెట్‌ ప్రవేశించలేకపోయింది.

కిందకు ఎలాంటి సంకేతాలు అందలేదు. కొంతసేపు తీక్షణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు చివరకు ఈ ప్రయోగం సఫలం కాలేదని, నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్‌ చేరలేదని ప్రకటించారు. ఏడాదిలోగా మళ్లీ స్వదేశీ ఇంజన్‌తో ప్రయోగం చేస్తామని ప్రకటించారు. ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌, మాజీ ఛైర్మన్‌లు మాధవన్‌నాయర్‌, కస్తూరిరంగన్‌, గౌరవ సలహాదారు నారాయణ తదితరులు ఈ కార్యక్రమాన్ని సమీక్షించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X