ఇస్లామాబాద్: పాకిస్థాన్లో జరిగిన కారుబాంబు దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య పాకిస్ధాన్ లోని కొహత్ నగరంలోని పోలీస్ స్టేషన్ పైనే ఈ దాడి జరిగింది. మందుగుండుతో నిండిన కారును ఆత్మాహుతి దళసభ్యుడు వేగంగా నడిపి పోలీస్స్టేషన్ ముందు పేల్చడంతో ఆ ప్రాంతంలోని ఏడుగురు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. జంట ఆత్మాహుతి దాడులు జరిగి 24 గంటల గడవక ముందే మరో ఆత్మాహుతి దాడి జరగడం గమనార్హం.