వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరహంతకుడు రామారావు కోసం గాలింపు

By Santaram
|
Google Oneindia TeluguNews

Khammam dist
టెక్కలి: జైలు నుంచి తప్పించుకున్న నరహంతకుడు తాడిపర్తి రామారావు కోసం టెక్కలి డివిజన్‌లో పోలీస్‌ యంత్రాంగం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ నెల 9న జిల్లా జైలు నుంచి తప్పించుకున్న రామారావు మొదట గార, ఎచ్చెర్ల మండలాల్లోని తీర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీస్‌ వర్గాలు అనుమానించాయి. తాజాగా టెక్కలి డివిజన్‌లోని నందిగాం, వజ్రపుకొత్తూరు మండలాల్లో సంచరిస్తున్నట్లు సమాచారమందడంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.

దీంతో వజ్రపుకొత్తూరు, నందిగాం, సంతబొమ్మాళి, పలాస ఎస్సైలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, అప్పలనాయుడు, ఆదాంలు రామారావు ఆచూకీ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆదివారం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ లోనూ రామారావు ఫొటో, వివరాలను ఉంచారు. అపరిచిత, అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమివ్వాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నందిగాం మండలం మర్లపాడు, వజ్రపుకొత్తూరు మండలం చిన్నమురహరిపురంలో ఎస్సైల బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X