హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూన్ లో రోశయ్య మంత్రివర్గ విస్తరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య తన మంత్రివర్గాన్ని జూన్ లో విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రులను తొలగించకుండా గరిష్ట స్థాయిలో మంత్రులను తీసుకుంటారు. మేలో జరిగే రాజ్యసభ, అసెంబ్లీ ఉప ఎన్నికల తరువాత జూన్‌లో విస్తరణ జరిగే అవకాశం ఉంది. గరిష్ఠంగా 44మందితో జంబో క్యాబినెట్ ను ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటీవలే ఢిల్లీ వెళ్ళినప్పుడు రోశయ్య పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వీరప్పమొయిలీ, అహ్మద్‌ పటేల్‌ లతో మంత్రివర్గంలో మార్పులపై చర్చించారు. కొంతకాలం ఆగితే మంచిదని వారు రోశయ్యకు సూచించినట్లు సమాచారం. మేలో రాజ్యసభ ఎన్నికలు, తెలంగాణలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రెండు ఎన్నికలు అయ్యాకే మార్పులు చేర్పులు చేపట్టాలని అధిష్ఠానం రోశయ్యకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రోశయ్య సోమవారం చీరాలలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో మంత్రివర్గం విస్తరణస్పష్టమైన సంకేతాలిచ్చారు. అనిశ్చిత పరిస్థితి తొలగిపోయిందని, మంత్రివర్గ విస్తరణ అవసరం ఉందని, మన దగ్గర రెండు చట్టసభలు ఉన్నాయని, లెక్క ప్రకారం 44 వరకు సంఖ్య పెరిగే అవకాశం ఉందని, సర్కారియా కమిషన్‌ సిఫార్సు మేరకు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తగు సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. దీన్ని బట్టి మంత్రి వర్గ విస్తరణ ఆలోచన ఆయన మనస్సులో ఉందని భావించవచ్చు.

ప్రస్తుతం మంత్రివర్గంలో 34 మంది సభ్యులున్నారు. ఇంకా 10మందిని కొత్తగా తీసుకునే వీలుంది. తనకు సంబంధించిన సీనియర్ శాసనసభ్యులను పది మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 294 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 44కు మించి ఉండకూడదు. దివంగత వైఎస్‌ 2004లో అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించారు. అప్పుడు సీఎంతో కలిసి మంత్రివర్గ సభ్యుల సంఖ్య 40. ఇప్పుడు గరిష్ఠస్థాయిలో 44 మందికి చోటు కల్పించేందుకు రోశయ్య సిద్ధమయ్యారు. వైఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రోశయ్య ఒక్కరికే శాసనమండలి నుంచి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీలకు కూడా రోశయ్య మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చునని ఆశపడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X