• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య

By Santaram
|

Hyderabad
హైదరాబాద్: ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఎనలిస్ట్ గా పనిచేస్తున్న యువకుడ్ని గుర్తుతెలి యని దుండగులు గొంతు కోసి, ముఖం చెక్కేసి దారుణంగా హత్య చేశారు. తల్లి ఫోన్‌ చేస్తే ఎంతకూ లిఫ్ట్‌ చేయకపోవడంతో...ఆమె వచ్చి చూడగా హత్యోదంతం బయటపడింది. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదూరి పార్థసారధి శర్మ ఎస్‌ బీఐ రిటైర్డు చీఫ్‌ మేనేజర్‌. అతని భార్య లకి కూడా బ్యాంకు ఉద్యోగి. వీరికి కవల పిల్లలు దినకర్‌ (31), దివాకర్‌ లతోపాటు ఒక కూతురు ఉన్నారు. పార్థసారధి, లకిలు ఖైరతాబాద్‌ లో నివాసం ఉంటుండగా, రెండవ కూమారుడు దివాకర్‌ యూఎస్‌ ఏలో, కూతురు ముంబయిలో స్థిరపడ్డారు. దినకర్‌ హైటెక్‌ సిటీలోని అమెజాన్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థలో రిస్క్‌ ఎనలైజర్‌గా పని చేస్తూ వనస్థలిపురం ఫేజ్‌-2లోని సొంత ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

ఇతనికి మూడు సంవత్సరాల క్రితం ఉప్పల్‌ కు చెందిన రమేష్‌ కుమార్తె స్వరూపరాణితో వివాహం జరిగింది. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదన్న కారణంతో దినకర్‌ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా ఆ కేసు నడుస్తోంది. ఇంటి పైపోర్షన్‌లో దినకర్‌ ఒంటరిగా ఉంటుండగా. కింద పోర్షన్‌ ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో సోమవారం పలుమార్లు ఫోన్‌ చేసినా దినకర్‌ ఫోన్‌ను ఎత్తకపోవడంతో తల్లి లకి ఉదయం 11 గంటలకు వనస్థలిపురంలోని ఇంటికి చేరుకుంది. తలుపు బయటినుంచి గడియ పెట్టివుండడంతో లోనికెళ్లి చూడగా దినకర్‌ మృతిచెంది కనిపించాడు. వెంటనే ఫోన్‌ లో భర్త పార్థసారధికి సమాచారం అందించగా ఆయన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దినకర్‌ను ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది. అతని చేతికి ఉన్న బంగారు బ్రాస్‌ లెట్‌, సెల్ఫ్‌లో ఉన్న ఉంగరాలు అలాగే ఉండడం, 'లేబ్రా' జాతి కి చెందిన భారీ సైజు కుక్క ఇంటిలోనే ఉండడం వల్ల ఇది దొంగలపని కాదని తెలుస్తోంది. దినకర్‌ ఒంటిపై నూలుపోగు లేకుండా చేసి, గొంతు కోసి, మొఖం చెక్కేసి చంపడాన్నిబట్టి చూస్తే అతనిపై తీవ్ర కక్షను పెంచుకున్న వారి పనిగా తోస్తోంది. తన కుమారునికి అత్తింటి వారితో వివాదాలు ఉన్నాయని, రెండు రోజుల క్రితం అతని మామ ఫోన్‌ లో బెదిరించినట్లు దినకర్‌ చెప్పాడని తండ్రి పార్థసారధి తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X