హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విస్తరణ మాట ఊరించడానికేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ ముఖ్యమంత్రి కె.రోశయ్య పదే పదే అంటున్నారు. చాలా కాలంగా ఆయన నోటి నుంచి ఈ మాటలు వెలువడుతున్నాయి. కానీ అది రూపు దాల్చడం లేదు. నిజంగానే మంత్రివర్గాన్ని విస్తరించాలనే ఆలోచన రోశయ్యకు ఉందా అనేది మొదటి ప్రశ్న అయితే, కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి మంత్రివర్గాన్ని విస్తరించే యోచన ఉందా అనేది మరో ప్రశ్న. ముఖ్యమంత్రి తీరు చూస్తే తన సొంత జట్టును ఏర్పాటు చేసుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. కానీ అధిష్టానం ఆలోచన మరో రకంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఒక్కసారి మంత్రివర్గాన్ని విస్తరించడం గానీ పునర్వ్యస్థీకరించడం గానీ చేస్తే అసమ్మతి భగ్గుమనే అవకాశాలున్నాయి.

పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన మంత్రులు తమ పదవులను కోల్పోతే మిన్నకుండే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. దీనివల్ల పరిస్థితి మళ్లీ మొదటికి రావచ్చునని పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇన్నాళ్లు పడిన శ్రమ వృధా అవుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందువల్ల మంత్రివర్గ విస్తరణ అంత సులభమైన పని కాదని తెలిసిపోతూ ఉంది. తాజాగా, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రోశయ్య చీరాలలో అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఊసే లేనప్పుడు ఆయన ఎందుకీ మాటలన్నట్లు అనేది ప్రశ్న.

మంత్రి పదవులు ఆశిస్తున్నవారిని, మంత్రి పదవులు పోకుండా కాపాడునుకునేవారిని తన చుట్టూ ఉంచుకోవడానికి ఆయన పదే పదే మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా ప్రజాపథం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆయన వ్యూహంలో ఒక భాగమని చెబుతున్నారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లోనూ శాసనసభ్యులు పార్టీ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనేచేసేలా చూడడం కూడా ఆయన వ్యూహంలో మరో భాగమని అంటున్నారు. నిజానికి, మంత్రి వర్గ విస్తరణ ఊసు ఇప్పట్లో వచ్చేది కాదనేది మాత్రం కొంత మంది గట్టిగానే చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X