వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేర్ని నానికి మంత్రివర్గంలో అవకాశం!

By Santaram
|
Google Oneindia TeluguNews

Perni Nani
విజయవాడ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జూన్‌లో జరుగుతుందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రకటించడంతో ఈసారి జిల్లాలో ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. పెనమలూరు ఎమ్మెల్యే కేపీ సారథి ఒక్కరే ప్రస్తుతం జిల్లా నుంచి మంత్రిమండలి సభ్యునిగా ఉన్నారు. విస్తరణలో బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని)కి ఈసారి చోటు దక్కుతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెసుకు ఆరు స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. టీడీపీ తరఫున ఎనిమిది మంది, పీఆర్పీ నుంచి ఇద్దరు ఎన్నికయ్యారు.

కాంగ్రెసు తరఫున కేపీ సారథి, పేర్ని వెంకట్రామయ్య రెండోసారి గెలిచారు. మిగిలిన వారిలో పామర్రు నుంచి డీవై దాస్‌, విజయవాడ సెంట్రల్‌ నుంచి మల్లాది విష్ణు, తిరువూరు నుంచి దిరిశం పద్మజ్యోతి, పెడన నుంచి జోగి రమేష్‌లు ఎన్నికయ్యారు. గత ఏడాది ఎన్నికల అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గ ఏర్పాటులో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో కేపీ సారథి, పేర్ని నాని పేర్లు అప్పట్లో ప్రముఖంగా వినిపించాయి. కాపు సామాజిక వర్గం నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో వట్టి వసంత కుమార్‌కు, గుంటూరులో కన్నా లకీ నారాయణకు ప్రాధాన్యం ఇవ్వడంతో నానికి మంత్రి పదవి లభించలేదు.

త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే 2004 నుంచి 2009 వరకు పేర్ని నాని బందరు నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ పరిగణనలోకి వస్తాయని నాయకులు పేర్కొంటున్నారు. సోమవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా మంత్రి సారథి మంత్రివర్గ విస్తరణ గురించి ప్రస్తావిస్తూ, జిల్లాలో మరొకరికి పదవి దక్కే అవకాశం ఉందని చెప్పారు. పేర్ని నానికి వచ్చే అవకాశాలున్నాయని కూడా బయటపెట్టారు. గతంలో మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా నానికి తృటిలో మంత్రి పదవి తప్పిందని వ్యాఖ్యానించారు. ఆయన సేవలను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవిని సీఎం కేటాయిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X