వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద కావాలనే పట్టుబడ్డాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూర్: తమిళ నటి రంజితతో రాసలీలలు జరుపుతూ వీడియోకు చిక్కిన నిత్యానంద స్వామి కావాలనే నాటకీయంగా అరెస్టు అయినట్లు వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న స్వామి నిత్యానంద బుధవారం హిమాచల్ ప్రదేశ్ లో పోలీసులకు చిక్కాడు. నిత్యానంద స్వామి అనుచరుడు ఒకతను హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా అర్కి గ్రామంలోని స్థావరం గురించి నేర విభాగం పోలీసులకు సమాచారం అందించినట్లు వార్తలు వచ్చాయి.

అరెస్టయితే బెంగుళూర్ లోని స్థానిక కోర్టు ద్వారా సులభంగా బెయిల్ పొందవచ్చునని అనుచరులు నచ్చజెప్పడంతో నిత్యానంద అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. స్వామి నిత్యానందను, అతనితో పాటు పట్టుబడిన మరో ముగ్గురిని పోలీసులు బెంగుళూర్ కోర్టులో ప్రవేశపెడతారు. నిత్యానంద, అతని అనుచరుడు నిత్య భక్తానంద అలియాస్ గోపాల్ సీలం రెడ్డిని కర్నాటకు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిత్యానందకు బుధవారం కర్నాటక హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X