• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిత్యానందకు గూటింపు, రంజితకై గాలింపు

By Santaram
|

Nityananda Swami
బెంగళూరు: నిత్యం భక్తుల సేవలతో తరించే రాసలీలల నిత్యానంద స్వామి ఇప్పుడు పోలీసుల ప్రశ్నలకు విలవిలలాడుతున్నారు. ఇక్కడి ప్యాలెస్‌ రోడ్డు కార్ల్‌టన్‌ హౌస్‌ లో సీఐడీ కార్యాలయంలో నిత్యానంద విచారణ కొనసాగుతోంది. నిత్యానందతో పాటు రాసలీలల సీడీలో కనిపించిన నటి రంజితను కూడా విచారణ కోసం నగరానికి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమెతో నిత్యానంద జరిపిన రాసలీలను సీడీల రూపంలో వెలుగులోకి తీసుకువచ్చిన డ్రైవర్ లెనిన్‌ కురుప్పన్‌, మరికొందరు భక్తులను విచారిస్తామని అధికారులు తెలిపారు.

నిత్యానంద పరమహంస అలియాస్‌ రాజశేఖరన్‌ (34), పుట్టు పూర్వోత్తరాలు, పూర్వాశ్రమంలోని జీవితం, ఎన్నిచోట్ల ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమాల స్థాపనకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు పలు ప్రశ్నలను సంధించారు. ఎందరితో రాసలీలలు చేశారు, ఎవరు సహకారం ఇచ్చారు? తదితర ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానం రావలసి ఉంది. 'కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. మరికొన్నింటికి నేనేమీ తప్పు చేయలేదు...అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారని' అధికారులు తెలిపారు. నిత్యానంద స్వామి పాద పూజల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసే విషయం తాజాగా వెలుగుచూసింది. నిత్యానంద చెన్నై పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇక్కడి మహిళా భక్తులు పోటీపడి పాద పూజలు నిర్వహించే వారని తెలిసింది. ఇందుకు ప్రతి ఒక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసే వారని నగర పోలీసులు శనివారం తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X