వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురు నకిలీ నక్సలైట్ల అరెస్టు

By Santaram
|
Google Oneindia TeluguNews

Nalgonda Dist
హుజూర్‌ నగర్: వాళ్ళు నకిలీ నక్సలైట్లు. అయినా వారి వద్ద విప్లవ సాహిత్యం....హుజూర్ ‌నగర్‌, కోదాడ, నేరేడుచర్ల తదితర ప్రాంతాలలో రెండేళ్ళుగా నక్సల్స్‌ పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఐదుగురు వ్యక్తులను హుజూర్‌నగర్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి పలు ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హుజూర్‌నగర్‌ సీఐ కెఎన్‌ విజయ్‌కుమార్‌ విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తుమ్మలచెరువుకు చెందిన బూసి రాంబాబు అలియాస్‌ సుదర్శన్‌రెడ్డి అలియాస్‌ విష్ణు అలియాస్‌ శ్రీనివాస్‌, మేళ్ళచెరువు మండలం వెల్లటూరుకు చెందిన బైరిపంగు యలమంద, బైరిపంగు కనకయ్య, మల్లారెడ్డిగూడెంకు చెందిన బైరిపంగు శంభయ్య, నేరేడుచర్ల మండలం సజ్జాపురంకు చెందిన ధీరావత్‌ కాంతారావులు నక్సల్స్‌ పేరుతో చందాలు వసూలు చేస్తున్నారు. సీపీఐ మావోయిస్టు నల్లమల ఏరియా కమిటీ కార్యదర్శి చంద్రన్నవర్గం, ఉత్తర తెలంగాణ కార్యదర్శి గణేష్‌ దళ సభ్యులమని వారి లెటర్‌ ప్యాడ్‌లపై లేఖలు రాసి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వ్యాపారులను, డబ్బున్నవారిని ఎంచుకుని లేఖలు చూపిస్తూ అజ్ఞాత ప్రదేశంలోకి తీసుకెళ్లి అలివ్‌ గ్రీన్‌ దుస్తులు ధరించి, ఆయుధాలతో బెదిరించి చందాలు వసూలు చేస్తున్నారు.

వీరిపై గుంటూరు జిల్లాలో రెండు, హుజూర్‌నగర్‌లో మూడు, మేళ్ళచెరువులో ఒకటి, ఖమ్మంలో ఒకటి, కోదాడలో మూడు కేసులు నమోదయ్యాయి. ఆదివారం బూసి రాంబాబు నేరేడుచర్లలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నకిలీ నక్సల్స్‌ ఉదంతం వెలుగు చూసింది. రాంబాబు మాజీ జనశక్తి నాయకుడు సత్యానంద్‌కు బావమరిది. రాంబాబు నివాసం ఉంటున్న ఇంటిలో ఆయుధాలు, సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X