హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేయర్లకు భాగ్యనగర దర్శన భాగ్యం

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: జాతీయ స్థాయి మేయర్స్ మీట్‌కు వచ్చిన మేయర్లంతా హైదరాబాద్ నగర పర్యటనలో సేద తీరారు. చారిత్రాత్మక నగరంలోని వివిధ పర్యాటక స్థలాల్ని సందర్శించి సంబరపడిపోయారు. హైదరాబాద్ అందాల్ని చూసి ముగ్ధులయ్యారు. అంతర్జాతీ య హంగులకు నిలయమైన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎ యిర్ పోర్టు వారిని చూపుమరలనివ్వలేదట.

విమానాశ్రయం నుంచి కొందరు పీవీఎక్స్ ప్రెస్ వే మీదుగా హైటెక్ సిటీకి వస్తే మరికొంత మంది ఔటర్ రింగ్ రోడ్డు వెంట నోవాటెల్‌కు వచ్చారు. నగరంలో ఏర్పాటైన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు వారిని ఎం తగానో ఆకర్షించాయి. శనివారం కార్యక్రమాలు పూర్తి అయిన పిమ్మట సాయంత్రం మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిసి ఆ తరువాత ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పర్యటించారు.

జెమ్స్ స్ట్రీట్, నెక్లస్ రోడ్డు అందాలను తిలకించారు. హుస్సేన్‌సాగర్‌లో ఉన్న గౌతమ బుద్దున్ని బోట్‌లో వెళ్లి మరీ దర్శించి పులకరించిపోయారు. ఆదివారం ఉదయం కార్యవర్గ సమావేశం ముగిసిన వెంటనే జెఎన్ఎన్‌యూఆర్ఎం నిధులతో ఆర్టీసీ నడిపిస్తున్న వోల్వో బస్సులో సండే డే అవుట్‌కు వెళ్లారు.

తొలుత గ్రేటర్ మేయర్ దంపతులు బండ చంద్రారెడ్డి, కార్తీకరెడ్డిలతో కలిసి శ్రీనగర్ కాలనీలోని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికెళ్లి కలిశారు. మేయర్ల డిమాండ్లకు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. కొంత సేపు కృష్ణకాంత్ పార్క్‌లో సేద తీరారు. ఈ పార్కును చెత్త డంపింగ్ యార్డుపై నిర్మించారని తెలిసి ఆశ్చర్యపోయారు.

పాతనగరంలోని సాలార్జంగ్ మ్యూజియం సందర్శించారు. పత్తర్‌గట్, బేగంబజార్‌లలో కొంత సేపు షాపింగ్ చేశారు. చార్మినార్‌ను కనులారా వీక్షించి తన్మయ త్వం పొందారు. అడుగడుగునా మేయర్లందరికీ బండ కార్తీక రెడ్డి దగ్గర ఉండి నగర అందాలని, విశిష్టతను వారికి వివరిం చారు. సాయంత్రం నోవాటెల్ హోటల్‌కు తిరిగి వచ్చారు. వారి వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X