హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా పిల్లలు వ్యాంపులా: తల్లిదండ్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: తమ పిల్లలను ఓ స్వచ్ఛంద సంస్థ వ్యాంపులుగా అభివర్ణించడంపై రియాల్టీ షోల్లో పాల్గొంటున్న పిల్లల తల్లిదండ్రులు మండిపడ్డారు. చిన్న పిల్లలకు ఎటువంటి దుస్తులు వేసినా ముద్దుగా ఉంటారని, వారికి ఆశ్లీలం అంటగట్టడం సరైంది కాదని వారన్నారు. రియాలిటీ షోల్లో చిన్న పిల్లలను అర్థనగ్నంగా చూపుతున్నారంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేయడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు. తమ పిల్లలను వ్యాంపులుగా అభివర్ణించడంపై వారు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ పిల్లలపై ఫిర్యాదు చేసిన ఎన్జీవో ప్రతినిధులు వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేసారు.

చిన్న పిల్లలకు అశ్లీలం అంటగడుతారా, అభం శుభం తెలియని పసి పిల్లలను వ్యాంపులంటారా, ఇలాంటి వ్యాఖ్యలతో వారి భవిష్యత్తును నాశనం చేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. రియాల్టీ షోల్లో సందర్భానుసారంగా దస్తులు వేస్తే ఏం తప్పు అని వారు అడిగారు. వారి ఇష్టానుసారమే పిల్లలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, వారిపై ఎటువంటి ఒత్తిడి పెట్టడం లేదని వారు చెప్పారు. ఈ కాలం పిల్లలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, టీవీల్లో డ్యాన్సులు చేస్తే తప్పేమిటని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X