హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోటీ నష్టం: తెలంగాణ కాంగ్రెసు నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Keshav Rao
హైదరాబాద్‌: ఉప ఎన్నికలకు కాంగ్రెసు పార్టీ దూరంగా ఉండాలని కాంగ్రెసు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో పార్టీ ప్రయోజనాలు, ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని వారు అధిష్టానాన్ని కోరాలని నిర్ణయించారు. ఒకవైపు నిజామాబాద్‌ లో పోటీకి సిద్ధమైన పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆదివారం కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో కాంగ్రెసు తెలంగాణ సీనియర్‌ నేతలు సమావేశమై ఎన్నికల్లో పోటీ చేయకూడదని అభిప్రాయపడ్డారు.

సెంటిమెంట్‌ ఆధారంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడమే మంచిదని సీనియర్‌ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేష్‌ రెడ్డి నివాసంలో జరిగిన తెలంగాణ సీనియర్ల కీలక సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.కేశవరావు, మాజీ మంత్రి కె.జానారెడ్డి, టీఆర్‌సీసీసీ కన్వీనర్‌ జి.చిన్నారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, సీనియర్‌ నేతలు పాల్వాయి గోవర్ధనరెడ్డి, కె.ఆర్‌.ఆమోస్‌, కమలాకరరావు, కె.యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ, శ్రీకృష్ణ కమిటీ ముందు విన్పించే వాదనలు, ప్రాణహిత-చేవెళ్ల సహా సాగునీటి ప్రాజెక్టుల అంశాలు చర్చకు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు బరిలోకి దిగితే కేవలం రాజకీయ కోణం మాత్రమే ఉంటుందని భేటీలో పాల్గొన్న సీనియర్‌ నేతలు అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X