వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలకు ఇక 4 గురు గన్ మన్లు

By Santaram
|
Google Oneindia TeluguNews

West Godavari Dist
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలకు ముందు జాగ్రత్తగా భద్రతను పెంచారు. ఇటీవల పలు ప్రాంతాల్లో మావోల కదలికలు ఉండటం, రాష్ట్రంలో ఉద్యమాలసెగ తగలడం, ప్రజాపథం జరుగుతుండటం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2009 ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు అప్పటి నుంచే ఇద్దరు గన్‌ మెన్‌ లతో భద్రత కల్పించారు. వారిలో ఒకరు డ్యూటీలో ఉంటే మరొకరు విశ్రాంతి తీసుకుని విధులు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఎమ్మెల్యేకి అదనంగా మరో ఇద్దరిని పెంచుతూ నలుగురు గన్‌మెన్‌లను ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర పోలీసు శాఖకు ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 18నుంచి జిల్లాలో ఇద్దరు మంత్రులు మినహా 13 మంది ఎమ్మెల్యేలకు మొత్తం నలుగురు గన్‌మెన్‌ల చొప్పున కేటాయిస్తూ జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. సంబంధిత గన్‌ మెన్‌ లు ఎమ్మెల్యేల వద్ద విధుల్లో చేరేందుకు ఈనెల 19న ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నారు.

జిల్లాలో భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), ముదునూరి ప్రసాదరాజు మాత్రమే నలుగురు గన్‌ మెన్‌ లను తీసుకునేందుకు అంగీకరించారు. మిగిలిన ఎమ్మెల్యేలు తమకు ఇద్దరు గన్‌ మెన్‌ లు చాలునని, నలుగురు అవసరం లేదని తేల్చిచెప్పినట్టు సమాచారం. గన్‌ మెన్ ‌లకు సౌకర్యాలు, వారికి వాహనం, తదితర ఏర్పాట్లు సమకూర్చేందుకు భారం అనుకునే ఎమ్మెల్యేలు ప్రభుత్వం తీసుకున్న భద్రత పెంపు నిర్ణయాన్ని అంగీకరించలేకపోతున్నారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలకు అదనంగా కేటాయించిన గన్‌మెన్‌లు జిల్లా కేంద్రానికి వెనుతిరిగి వచ్చేస్తున్నట్టు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X