శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధిక ధరలు ప్రభుత్వ అసమర్థతే: ఎర్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Yerran Naidu
శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ విధానాల వల్లే ధరలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరావు ఎర్రన్నాయుడు ఆరోపించారు. అధిక ధరలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం, వామపక్షాలు మంగళవారం హర్తాళ్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ఎదుట జరిగిన ఆందోళనలో ఎర్రన్నాయుడు పాల్గొని మాట్లాడారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడమే తమ కార్యక్రమం ఉద్దేశమన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందరోజుల్లో ధరలను అదుపుచేస్తామని ప్రకటించిందని, అందుకు విరుద్దంగా 200 రెట్లు ధరలు పెరిగాయని ధ్వజమెత్తారు. అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మంగళవారం ప్రవేశపెడుతున్న కోత తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి ఓ గుణపాఠమని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X