విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైష్ణవి హత్యకేసులో ఈవారమే చార్జిషీట్

By Santaram
|
Google Oneindia TeluguNews

Naga Vaishnavi
విజయవాడ: సంచనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో రెండుమూడు రోజుల్లో ఛార్జిషీటు కోర్టులో దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితులు పంది వెంకట్రావ్ గౌడ్, మోర్లా శ్రీనివాసరావు, వెంపరాల జగదీష్ ‌ను నార్కో అనాలసిస్ పరీక్షలకు తరలించేందుకు తేదీలు ఖరారు కావడంతో వారిని గుజరాత్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులు గడువులోగా ఛార్జిషీటు దాఖలు చేయనిపక్షంలో నిందితులకు బెయిల్ మంజూరయ్యే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే నిందితులపై నేర నిరూపణకు సంబంధించి ఇప్పటికే నెలకొని ఉన్న అనుమానాలు బలపడే ప్రమాదం ఉంది. ఛార్జిషీటు కనుక దాఖలు కానిపక్షంలో బెయిల్ పొందే అవకాశం ఉన్నందున నిందితులు ముగ్గురూ ఇప్పటికే కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు.

నిందితులు ముగ్గురి తరఫున వేర్వేరుగా వారి న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లపై వాదోపవాదాలు వినిపించేందుకు మహిళా సెషన్స్ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఇదిలావుండగా నిందితులకు నార్కో పరీక్షలు చేయించేందుకు కోర్టు అనుమతి పొందిన పోలీసులు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నార్కో ల్యాబ్ నుంచి తేదీలు ఖరారు చేసుకున్నారు. మే 1నుంచి 10వరకు షెడ్యూలు ఖరారు కాగా నిందితులు అరెస్టయి 4వ తేదీకి 90రోజులు ముగుస్తుంది. 90రోజుల్లోగానే ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉన్నందున 1నుంచి 4వ తేదీలోగా ఏరోజైనా దాఖలు చేసే అవకాశం ఉంది.

పోలీసు ఛార్జిషీటు దాఖలు చేసే సమయానికి నిందితులను ఇక్కడి నుంచి నార్కో పరీక్షలకు తరలించవచ్చు. అయితే ఛార్జిషీటు కాపీలు నిందితులకు చేరాల్సి ఉన్నందున బహుశా ఈ తంతు పూర్తయిన తర్వాతే గుజరాత్ తీసుకెళ్లవచ్చనే అభిప్రాయం వ్యక్తవౌతోంది. ఛార్జిషీటు దాఖలుకు సన్నాహాలు చేస్తున్న పోలీసులు మరోవైపు నిందితులను నార్కో పరీక్షలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా కొద్దిరోజుల్లో కోర్టు ద్వారా జిల్లా జైలు నుంచి వీరిని జుడిషియల్ కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X