హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఓ పిట్టల దొర: గోనె ప్రకాష్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై కాంగ్రెసు నాయకులు బుధవారం మండిపడ్డారు. కెసిఆర్ ఓ పిట్టల దొర అని గొనె ప్రకాశ్ రావు వ్యాఖ్యానించారు. డిఎస్ పై వ్యాఖ్యలు చేసే స్థాయికి కెసిఆర్ కు లేదని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి డిఎస్ ను గెలిపిస్తానని కెసిఆర్ అనడాన్ని ఆయన అవహేళన చేశారు. పది పార్లమెంటు స్థానాలకు పోటీ చేసి తెరాస రెండు స్థానాలను బొటాబొటీ మెజారిటీతో గెలుచుకుందని ఆయన అన్నారు.

తన అభ్యర్థులను కూడా గెలిపించుకునే స్థాయి కెసిఆర్ కు లేదని, అటువంటి కెసిఆర్ డిఎస్ ను గెలిపించాలని అనడం స్థాయిని మర్చిపోయి మాట్లాడడమే అని ఆయన అన్నారు. నోరు పారేసుకోవద్దని మరో కాంగ్రెసు నాయకుడు టి. తులసి రెడ్డి కెసిఆర్ కు సలహా ఇచ్చారు. ఐదు జిల్లాల్లో తెరాస ఖాతా కూడా తెరవలేదని ఆయన అన్నారు. తెరాస బలం అంతంత మాత్రమేనని, స్థాయి మరిచిపోయి కెసిఆర్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X