• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సొరేన్ తో సంధి ఉండదు: బిజెపి

By Pratap
|

Shibu Soren
న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలనే తమ నిర్ణయంలో మార్పు లేదని, సొరేన్ తో సంధి ఉండదని బిజెపి స్పష్టం చేసింది. తమ పార్టీ శాసనసభ్యులు గవర్నర్ ను కలిసి సొరేన్ కు మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖను అందజేస్తారని బిజెపి నేత సుష్మా స్వరాజ్ గురువారంనాడు చెప్పారు.

యుపిఎ ప్రభుత్వానికి మద్దతుగా కోత తీర్మానంపై వోటు వేసినందుకు క్షమాపణలు చెబుతూ సొరేన్ బిజెపి నాయకులు అద్వానీ, సుష్మా స్వరాజ్, గడ్కరీలకు లేఖలు రాశారు. అయినా బిజెపి కరుణించలేదు. అనారోగ్యం కారణంగా కోత తీర్మానానికి వ్యతిరేకంగా తాను ఓటు చేశానని ఆయన చెప్పుకున్నారు.

బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందనే వార్తలను సుష్మా స్వరాజ్ ఖండించారు. బిజెపి నాయకుడు ముఖ్యమంత్రిగా, శిబూ సొరేన్ కుమారుడు హేమంత్ ఉప ముఖ్యమంత్రిగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని సుష్మా స్వరాజ్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X