హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ లో ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు ధర్నా చేస్తోంది. సుజాత అనే యువతి హైదరాబాదులోని బాలాపూర్ లెనిన్ నగర్ లోని ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తోంది. పవన్ తో తన పెళ్లి జరిపించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. వవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుజాత గర్భవతి కూడా. పవన్ వల్లనే తనకు గర్బం వచ్చిందని ఆమె ఆరోపిస్తోంది.

అయితే సుజాత ఆరోపణను పవన్ ఖండిస్తున్నాడు. సుజాతకు వేరే పురుషుడితో సంబంధం ఉందని, అతని ద్వారా ఆమె గర్భం దాల్చిందని, అందువల్లనే తాను సుజాతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం లేదని పవన్ అంటున్నాడు. పవన్ తో పెళ్లి జరిగే వరకు తాను కదలబోనని సుజాత అంటోంది. సుజాత తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కూడా కూతురితో పాటు కూర్చుంది. సుజాత తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X