హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్యురిటీ లోపంతో బిగ్ బజార్ మూసివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: భద్రతా లోపం కారణంగా పోలీసులు శుక్రవారంనాడు హైదరాబాదులోని ఓ బిగ్ బజార్ ను, ఓ స్పెన్సర్ సంస్థను పోలీసులు మూసేశారు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా లేరనే కారణంగా పోలీసులు ఆ వాణిజ్య సముదాయాల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసి క్రాస్ రోడ్డులోని బిగ్ బజార్ ను, గొల్కొండ చౌరస్తాలోని స్పెన్సర్ ను మూసేశారు.

పోలీసులు శుక్రవారం ఈ రెండు దుకాణాల్లో మోక్ డ్రిల్ నిర్వహించారు. డమ్మీ బాంబులతో లోనికి ప్రవేశించారు. వారిని ఎవరూ తనిఖీ చేయకపోవడం, తాము ఏ అడ్డంకులు లేకుండా లోనికి ప్రవేశంచడానికి వీలు కలగడంతో పోలీసులు సెక్యూరిటీ లేదనే కారణంతో వాటిని మూసివేయించారు. హైదరాబాద్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లనుందనే హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య సంస్థలు సెక్యూరిటీ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని, తనిఖీలు నిర్వహించిన తర్వాతనే లోనికి అనుమతించాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఆ షాపులు ఖాతరు చేయలేదని అర్థమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X