వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియోలో ఉంది నేను కాదు: రంజిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Ranjitha
బెంగళూరు: వివాదాస్పద వీడియో టేపుల గురించి నటి రంజిత ఎట్టకేలకు నోరు విప్పారు. నిత్యానందతో శృంగారం జరుపుతున్నట్లు టీవీలో ప్రసారమైన వీడియోల్లో ఉన్న మహిళ తాను కానని ఆమె స్పష్టంచేశారు. 72 గంటల్లో ఆ వీడియోలను తొలగించాల్సిందిగా గూగుల్‌, యూట్యూబ్‌ సంస్థలకు ఢిల్లీకి చెందిన తన న్యాయవాదుల ద్వారా నోటీసులు పంపారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే నిత్యానంద మాజీ భక్తుడు లెనిన్‌ మీద కూడా రంజిత కేసు వేసినట్లు ఆమె తరపున న్యాయవాది వివరించారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఆమె సురక్షిత ప్రదేశంలో ఉన్నారని వివరించారు.

రాసలీలలతో పాటు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానందను జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించాలని రామనగర జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. మే 12 వరకు ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంటారు. ఆయనను రామనగర జిల్లా జైలుకు తరలించారు. జైల్లో ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయనను ప్రశ్నించే నిమిత్తం ఇప్పటివరకు సీఐడీ పోలీసులు తమ కస్టడీలో ఉంచుకున్నారు. శుక్రవారం ఆయనను రామనగర కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X