వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద పుష్కర్ తో థరూర్ నిశ్చితార్థం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Shashi Tharoor
ముంబై: ఐపియల్ వివాదంలో చిక్కుకుని మంత్రి పదవిని పోగొట్టుకున్న కాంగ్రెసు నేత శశి థరూర్ తో సునంద పుష్కర్ నిశ్చితార్థం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వార్తా కథానాన్ని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. జూన్ 27వ తేదీన బెంగళూర్ లోని సంజయ్ ఖాన్ కు చెందిన లగ్జరీ హోటల్ గోల్డెన్ పామ్స్ రిసార్ట్ అండ్ స్పాలో జరగనున్నట్లు సమాచారం. తన నిశ్చితార్థంపై ఆనందం పట్టలేని సునంద పుష్కర్ మిత్రులతో చెబుతున్నట్లు తెలుస్తోంది.

సంజయ్ ఖాన్ ఢిల్లీలో ఓసారి శశి థరూర్ ను కలిశారు. ఖాన్ సతీమణి జరీనే ఆహ్వానం మేరకు శశి థరూర్, సునంద పుష్కర్ ఏప్రిల్ మొదటి వారంలో ఆ హోటల్లో గడిపినట్లు తెలుస్తోంది. జూన్ 27వ తేదీన నిశ్చితార్థం, మరో ఆరు నెలలకు వివాహం జరుగుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక అంతా సిద్ధమైనట్లు చెబుతున్నారు. శశి థరూర్ నిశ్చితార్థం కోసం హోటల్ బుక్ అయినట్లు తనకు తెలియదని ఖాన్ అంటున్నారు. ఇ - మెయిల్ లో సంప్రదించడానికి ప్రయత్నించామని, అయితే శశి థరూర్ అందుబాటులో లేరని ఆ ఆంగ్ల పత్రిక రాసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X