హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నాటకలో వికారుద్దీన్ అరెస్టు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: కరుడు గట్టిన ఉగ్రవాది వికారుద్దీన్ ను పోలీసులు కర్నాటకలోని గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులోని ఫలక్ నుమా ప్రాంతంలో వికారుద్దీన్ హోం గార్డును కాల్చి చంపాడు. అలాగే, 2008 డిసెంబర్ లో హైదరాబాదులోని సైదాబాదులో కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు. వికారుద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, హైదరాబాదు పాతబస్తీలో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఇద్దరు కార్యకర్తలను కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులో ఉగ్రవాద దాడులు జరగవచ్చునన్న హెచ్చరికల నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X