• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కసబ్ కు ఉరిశిక్షపై ఉప్పొంగుతున్న ఆనందం

By Santaram
|

Ajmal Kasab
హైదరాబాద్‌: నరరూప రాక్షసుడికి మరణ శిక్ష పడడంపై దేశంలో దీపావళి అంత సంబరం జరుగుతోంది. ముంబై మారణహోమం కేసులో కసబ్‌కు మరణశిక్ష విధించడంపై దేశవ్యాప్తంగా ఆనందోత్సవాలు జరుగుతున్నాయి. కరుడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు శిక్ష సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంచి, ఉగ్రవాదం అంతమొందించాలని నినాదాలు చేశారు.

మతోన్మాదాన్ని ఎంతమాత్రం సహించవద్దని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని సూచించారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలు చేయకపోవడాన్ని విద్యార్థులు తప్పుపట్టారు. కసబ్‌కు శిక్ష అమలులో జాప్యం చేయవద్దన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X