హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్యతో సినిమా తీసినా..: దాసరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన సినీ నటుడు బాలకృష్ణతో సినిమా తీసినంత మాత్రాన తాను కాంగ్రెసుకు దూరమవుతున్నట్లు కాదని ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు అన్నారు. బాలయ్యతో ఆయన తన 150వ చిత్రాన్ని తీయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. తాను కాంగ్రెసులోనే ఉన్నానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆయన అన్నారు. బాలయ్యతో సినిమా తీస్తే తన రాజకీయ నిబద్ధతను వదులుకున్నట్లు కాదని ఆయన అన్నారు.

బాలకృష్ణ తనకు ఆప్తుడు, కావాల్సినవాడని ఆయన అన్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తనకు అప్తుడు, కావాల్సినవాడని ఆయన అన్నారు. ఎవరి భావాలకు అనుగుణంగా వారు పార్టీలు పెట్టుకున్నారని, అంత మాత్రాన సినిమా రంగంలో విడివిడిగా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన అవసరం ఏర్పడినప్పుడు కాంగ్రెసు కార్యకలాపాల్లోకి దూకుతానని ఆయన చెప్పారు. మంత్రి మండలి సభ్యులతో విభేదాలు ఉంటే ముఖ్యమంత్రి రోశయ్యనే చెప్పి ఉండేవారని ఆయన అన్నారు. మంత్రి మండలి సభ్యులతో రోశయ్యకు విభేదాలు లేవని ఆయన అన్నారు. అవసరం వచ్చినప్పుడు తెలంగాణపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X