హైదరాబాద్: కెజి బేసిన్ గ్యాస్ విషయంలో సుప్రీంకోర్టులో తమ వాదనే నెగ్గిందని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. అంబానీ సోదరుల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడుతామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గ్యాస్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా తమ వాదనలు వినిపిస్తామని ఆయన చెప్పారు.
మన రాష్ట్రంలో గ్యాస్ ఉత్పత్తి అవుతోంది కాబట్టి గ్యాస్ కేటాయింపుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు ఇతోధిక తోడ్పాటు అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రమే రాష్ట్రాల మధ్య గ్యాస్ కేటాయింపు జరుపుతుందని, ఆ సమయంలో మనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతామని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి