వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి రాను: శేఖర్ కమ్ముల

By Santaram
|
Google Oneindia TeluguNews

Sekhar Kammula
విశాఖపట్నం: సామాజిక మార్పు ఆశించే లీడర్‌ సినిమా తీశానని ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత శేఖర్‌ కమ్ముల తెలిపారు. ఏయూ అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొని, తన సినీ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఎన్నికల సమయంలో సినిమా తీసి విడుదల చేయాలనే ఆలోచనతో 'లీడర్‌'ను ప్రారంభించినప్పటికీ కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదన్నారు. ఎన్నికల అనంతరం ప్రజల మనిషిగా ఎదిగిన దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డికి సినిమా చూపిస్తే, ఆయన అవినీతిపై పోరాటం చేస్తారని భావించానని చెప్పారు. ఈ సినిమా ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదని స్పష్టం చేశారు.

సమాజంలోని నల్లధనాన్ని వెలికి తీయడం ఖచ్చితంగా సాధ్యపడుతుందని ప్రేక్షకుల ప్రశ్నకు సమాధానం చెప్పారు. మనకు సాధ్యపడదని అనుకున్న రోజున బతకటమే వృథాని ఆయన అభిప్రాయపడ్డారు. తాను భవిష్యత్‌లో నటనలోకి, రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. డబ్బు, కీర్తి, ప్రతిష్టలు సంపాదించాలనే ఉద్దేశంతో సినీ రంగంలోకి రావద్దని యువతకు సూచించారు. సినిమానే జీవితంగా భావించి, తమపై తమకు నమ్మకం ఉంటేనే పరిశ్రమలో మనుగడ సాధ్యమని చెప్పారు. దేశంలో అవినీతి అంతానికి ఎంత మంది శేఖర్ ‌లు రావాలని ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు... రావాల్సింది శేఖర్‌ కమ్ములలు, సినిమాలు కాదని, నిజమైన లీడర్ ‌లు, అవినీతిపై పోరాటం చేసే రాజకీయ నాయకులని సమాధానమిచ్చారు. దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X