విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో ప్రజల వద్దకు పోలీసులు!

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: విజయవాడ పోలీసులు మరో వినూత్న కార్యక్రం చేపట్టారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. 'మే ఐ హెల్ప్‌ యూ' పేరుతో మొబైల్‌ బూత్‌ను ఏర్పాటు చేసినట్లు శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఒక పోలీసు వాహనాన్ని ఇందుకోసం కేటాయించారు. ఈ వాహనం ప్రతిరోజూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా జనం సంచారం తక్కువగా ఉండి, పోలీసులు వెళ్లని ప్రాంతాల్లో తిరుగుతుంటుంది. వివిధ ప్రాంతాల్లోని సందులు గొందుల్లో ఈవ్‌టీజింగ్‌, గొడవలు, ఘర్షణలు, దొంగతనాలు తదితర వాటిని నివారించడానికి ఈ మొబైల్‌ బూత్‌ను ఏర్పాటుచేశారు.

డీసీపీ విజయ్‌ కుమార్‌ పరిస్థితిని బట్టి ఈ వాహనం ఏరోజు ఎక్కడుండాలో నిర్ణయిస్తారు. ఈ బూత్‌ కు ఒక ఎస్‌ ఐని ఇన్‌ చార్జిగా నియమించి ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు. ప్రజలు తమ సమస్యలను ఈ బూత్‌ కు లిత పూర్వక ఫిర్యాదు చేస్తే అక్కడికక్కడే రశీదు ఇస్తారు. ఆ తర్వాత సంబంధిత పోలీస్‌ స్టేషన్లు, బ్లూకోల్ట్‌ లకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కరిస్తారు. ఫిర్యాదులే కాకుండా ప్రజలు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఈ బూత్‌ లో ఇవ్వొచ్చు. దీనివల్ల ప్రజలు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లకుండా తమ దగ్గరికే వచ్చిన వారికి సమస్యలు చెప్పుకోవచ్చు.

పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ప్రయోగాత్మకంగా ఈ మొబైల్‌ బూత్‌ ను ఏర్పాటుచేసినట్లు సీపీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చెప్పారు. ప్రజల ఆదరణను బట్టి ఇందులో మార్పులు చేర్పులు చేస్తామని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X