హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆందోళన విరమించండి: దానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: ఆందోళన విరమించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వరంగల్లోని ఎంజిఎం ఆస్పత్రి జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యులు తమ కోరికలను వెల్లడించాలని ఆయన సూచించారు. జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. న్యాయబద్దమైన జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

జూనియర్ డాక్టర్ల ఆందోళన వల్ల రోగులు మృతి చెందిన ఘటనపై నివేదిక కోరామని ఆయన చెప్పారు. వైద్యుల చర్యలు రోగులకు ఇబ్బందులు కలిగించకూడదని ఆయన అన్నారు. మృతి చెందినవారిని ఎలాగూ తిరిగి రప్పించలేమని, అయితే ఇప్పటికైనా పరిస్థితిని గమనించి జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తే మంచిదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X