వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైరాన్ సింగ్ షెకావత్ కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhairon Singh Shekhawat
జైపూర్: మాజీ ఉప రాష్ట్రపతి, బిజెపి నేత బైరాన్ సింగ్ షెకావత్ శనివారం జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో ఆయన గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షెకావత్ మరణంతో బిజెపిలో విషాద వాతావరణం నెలకొంది. ఆయన మూడు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

షెకావత్ 1923 అక్టోబర్ 23వ తేదీన దేవీ సింగ్ షెకావత్, బన్నే కన్వర్ దంపతులకు ఖచిర్యావాస్ గ్రామంలో జన్మించారు. ఆయన సూరజ్ కన్వర్ ను వివాహమాడారు. వారికి రతన్ కన్వర్ అనే కూతురు ఉంది. షెకావత్ తన తండ్రి మరణం కారణంగా కళాశాల విద్యను అభ్యసించలేకపోయారు. రైతుగా, సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. కాంగ్రెసు వ్యతిరేక రాజకీయ నాయకుల్లో షెకావత్ అత్యంత ప్రధానమైనవారు. ఆయన 1952లో రాజకీయాల్లోకి వచ్చారు. రాజస్థాన్ లో బిజెపి రాజకీయ ప్రాబల్యానికి ఆయన విశేష కృషి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X